Thursday, 20 May 2021

ఆవారా జింద‌గి టీం డిఫరెంట్‌ ప్లాన్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం స్పెషల్ వీడియో

టాలీవుడ్ అగ్ర హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్‌‌కి బర్త్ డే విషెస్ చెప్పడం కోసం డిఫరెంట్ ప్లాన్ చేసింది '' టీం. నేడు (మే 20) జూనియర్ పుట్టినరోజు సందర్భంగా అభిమాన వర్గాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త వినూత్నంగా ఆలోచించి ఓ యానిమేషన్ వీడియోతో స్పెషల్ విషెస్ చెప్పింది 'ఆవారా జింద‌గి' చిత్రయూనిట్. గ‌తంలో సాయి రామ్ శంక‌ర్‌, శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `నేనొకర‌కం` చిత్రాన్ని నిర్మించిన విభ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు ప్రస్తుతం `ఆవారా జింద‌గి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో బి.మ‌ధుసూద‌న్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో శ్రీహ‌న్‌, అనుప‌మ్‌, లంబు, సాయాజీ షిండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్‌గా ఫినిష్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ చేయడంలో బిజీగా అయిన యూనిట్ డిఫరెంట్ ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే యానిమేషన్ వీడియోతో ఎన్టీఆర్‌కి స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి నందమూరి ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు. ఈ యానిమేషన్‌ను విభ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bFmVMW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...