Saturday, 8 May 2021

నిజమైన ఆపద్బాంధవుడు!.. సోనూ సూద్‌‌కు దండం పెట్టేసిన మెహర్ రమేష్

అందరివాడు.. ఆపద్బాంధవుడు ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా సోనూ సూద్‌కు తక్కువే అవుతుంది. గత ఏడాదికిపైగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూనే ఉన్నారు. దేశంలోని నలుమూలలా సోనూ సూద్ సాయాన్ని పొందిన వారున్నారు. దేశంలోని చాలా గ్రామాల్లో సోనూ సూద్ పేరిట కాలనీలు, బస్తీలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల సోనూ సూద్ విగ్రహాలను సైతం ప్రతిష్టించారు. అలా సోనూ సూద్ చేసే సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సోనూ సూద్ మరింత శక్తిని తెచ్చుకుని పని చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారందరికీ పంపించే ఏర్పాట్లు చేశారు. రెమ్ డెసివర్ కొరతను తీర్చుతున్నారు. అలా అడిగిన సాయాన్ని కూడా తీర్చేశారు. తనకు తెలిసిన వారి కోసం మెహర్ రమేష్ కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం ఎంతో ప్రయత్నం చేశారట. కానీ ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు. మెహర్ రమేష్ పెట్టిన అభ్యర్థనపై సోనూ సూద్ స్పందించారు. సోదరా.. నువ్ అడిగిన ప్రతీ మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది.. ఆయన ప్రాణాన్ని కాపాడుదాం అని సోనూ సూద్ సాయం చేసేశారు. దీనిపై మెహర్ రమేష్ ఎమోషనల్ అయ్యారు. ఆకాశమంతా ప్రేమను కురిపించారు. ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపించారు. సరైన సమయంలోనే అన్ని మందులను పంపించారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతమైన పనితనాన్ని కనబర్చింది.. ఇంకా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vOfYR6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...