Saturday, 8 May 2021

అలా అంటే కోపం వస్తుందేమో గానీ.. ఇక ప్రతీ రోజూ రాత్రి.. సునీత కామెంట్స్ వైరల్

సింగర్ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తీయని గొంతు వినని, ఆమె పాటలను ఆస్వాధించని తెలుగువాళ్లెవ్వరూ ఉండరు. మెలోడి పాటలను మరింత తీయగా పాడే సునీత ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ అవుతున్నారు. రెండో పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు సునీత బుల్లితెర మీదా రచ్చ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనిని వివాహాం చేసుకున్న సునీత పూర్తిగా మారిపోయారు. పెళ్లి తరువాత కొత్త సునీతను లోకానికి పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది వరకెన్నడూ లేనంత యాక్టివ్ అయ్యారు. వెరైటీ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు సునీత డ్రామా జూనియర్స్ అంటూ జీ తెలుగు చానెల్‌లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. అందరూ భయాందోళనలో బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోఉన్నారు. అలాంటి తరుణంలో సునీత తన గొంతును వినిపిస్తూ కాసేపైనా అందరిలోనూ ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో సునీత లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్ల కామెంట్లకు బదులు ఇస్తూనే.. వారు కోరిన పాటలన్నీ లైవ్‌లోనే ఆలపించారు. తమ జోడి బాగుందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అలా సునీత పాటలు పాడుతుంటే అందరూ మైమరిచిపోయారు. సునీత కెరీర్‌లోని మెలోడి పాటలను అందరూ అడిగేశారు. అయితే ఈక్రమంలో సునీత కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇలా అంటుంటే అందరికీ కోపం వస్తుందేమో. కానీ ఎక్కువగా బయటకు వెళ్లకండి.. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లండి.. మన పొట్ట పోషించుకోవాలి.. అలాంటప్పుడు బయటకు వెళ్లాల్సిందే. కానీ జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. ఇలా నేను పాడుతుంటే కొంతమందైనా తమ బాధలు మరిచిపోయి సంతోషంగా ఉంటారంటే ప్రతీ రోజూ రాత్రి ఇదే సమయానికి ఓ అర్దగంటపాటు లైవ్‌లోకి వస్తాను.. రోజూ పాటలు పాడుతాను అని సునీత చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3baSrlF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...