ప్రస్తుతం మన దేశం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకూ ఈ వైరస్ మన దేశాన్ని కుదిపేస్తోంది. రోజుకు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో మంది ఆక్సిజన్ అందక చనిపోతోన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులను చూసి ప్రజలెంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. గత ఏడాది నుంచి సెలెబ్రిటీలు కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాలెన్నో చేస్తూ వస్తున్నారు. ప్లాస్మా దానం చేయాలని ప్రతీ ఒక్క సెలెబ్రిటీ అందరినీ రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఉధృతి గురించి అందరూ ఆందోళన చెందుతున్న ఈ సమయంలో సెలెబ్రిటీలు జనాల్లో ధైర్యం నింపేందుకు వస్తున్నారు. ఈక్రమంలో వేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలో.. బయటకు వెళ్లే ప్రతీసారి కచ్చితంగా మాస్కులు ధరించండి.. అది కూడా తప్పని సరి అయితేనే బయటకువెళ్లండి. ఒక వేళ కరోనా పాజిటివ్ వస్తే.. స్వీయ నిర్భంధంలోకి వెళ్లండి.. ప్రతీరోజూ మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకోండి.. ఇక తప్పదు.. కచ్చితంగా హాస్పిటల్‌లో చేరాలని వైద్యులు చెబితేనే చేరండి.. అలా అయితేనే అత్యవసరంలో ఉన్న వాళ్లకు బెడ్స్ దొరుకుతాయి.. ఈ దుర్భర పరిస్థితి నుంచి మనం బయటపడతాం.. మరింత శక్తివంతంగా తయారవుతమనే నమ్మకం నాకుంది.. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని మహేష్ బాబు అన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్‌ను వాయిదా వేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xU0PQ1
v
No comments:
Post a Comment