Saturday, 8 May 2021

పొద్దునే లేచి ఫోన్‌లో అవి చూస్తాను.. సీక్రెట్స్ బయటపెట్టేసిన సురేఖా వాణి కూతురు

టాలీవుడ్ నటి సురేఖా వాణికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. తన కూతురిని కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేలా చేసేశారు. ఇప్పుడు సుప్రితకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో సుప్రితకు ట్రోలింగ్ ఎదురవుతుంటుంది. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్ల మీదా రివర్స్ కౌంటర్లు ఇస్తుంటారు. సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందనే రూమర్లు రోజూ వస్తుంటాయి. అయితే వాటిపై ఇది వరకే సురేఖా వాణి, సుప్రతి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తన కూతురికి ఇష్టమైతే నేను ఏమీ అడ్డు చెప్పను అని సురేఖా వాణి చెప్పుకొచ్చారు. తనకు హీరోయిన్ అవ్వాలన్న ఆశేమీ లేదని సుప్రిత కూడా ఎన్నో సార్లు తెలిపారు. తాజాగా లైవ్‌లోకి వచ్చిన సుప్రిత ఈ విషయం మీద మాట్లాడారు. టిక్ టాక్ ఓ ఊపు ఊపిన సమయంలో సుప్రిత తెగ హల్చల్ చేశారు. తన తల్లి సురేఖా వాణితో కలిసి చేసే టిక్ టాక్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సుప్రిత తన ఫోకస్ మీద ఇన్ స్టాగ్రాం మీదే పెట్టినట్టు కనిపిస్తున్నారు. రీల్ వీడియోలతో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటారు. అలా నిన్న లైవ్‌లోకి వచ్చిన సుప్రితను తన ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. అందరూ హాయ్ అని కామెంట్లు చేస్తున్నాయి.. హాయ్ అని చెప్పి చెప్పి బోర్ కొడుతోంది.. ఏదైనా ప్రశ్నలు అడగండి అంటూ సుప్రిత తన ఫాలోవర్లను కోరింది. ఇక కొందరు తన పెట్ కృష్ణ గురించి అడిగారు. లైవ్‌లోనే తన పెట్‌ను చూపించారు. ఇంకొంత మంది సురేఖా వాణి గురించి అడిగారు. వకీల్ సాబ్ సినిమా చూస్తూ బిజీగా ఉన్నారని సుప్రిత చెప్పుకొచ్చారు. ఉదయం లేచిన వెంటనే ఫోన్‌లో ఏ యాప్ వాడుతారు? అని ఓ నెటిజన్ సుప్రితను అడిగాడు. దానికి సమాధానం సుప్రిత ఓ పెద్ద లిస్టే చెప్పేశారు. మొదటగా స్నాప్ చాట్ చూస్తాను ఆ తరువాత వాట్సప్, ఇన్ స్టాగ్రాంలు చూస్తాను. ఫోన్‌లు చేసినా అంతగా రెస్పాండ్ అవ్వను.. వాటిని చూడను అని తన అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tsp5oZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...