Monday, 17 May 2021

ప్రముఖ సినీ నటి ఇంట విషాదం.. అనారోగ్యంతో ‘నాట్యమయూరి’ తండ్రి కన్నుమూత!

తెలుగు ప్రేక్షకులకు ‘నాట్యమయూరి’ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుధా చంద్రనే. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె.. పట్టు వదలకుండా పెట్టుకుకాలుతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి భారత్‌లో పాటు విదేశాల్లోనూ భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చి.. అందరిని ఆకట్టుకుంది. మయూరి అనే సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ మలయాళ, బెంగాలీ సినిమాల్లోనూ, కొన్ని సీరియల్స్‌లోనూ నటించింది. అయితే ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేడీ చంద్రన్ ఈ నెల 12వ తేదీన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో.. ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేడీ చంద్రన్ నటుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించారు. హ‌మ్ హై ర‌హీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే స‌ప్నే’, ‘హ‌ర్ దిల్ జో ప్యార్ క‌రేగా’, ‘కోయీ మిల్ గయా’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాదు, 'గుల్మొహర్' టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు. తన తండ్రి మరణ వార్తని సుధా చంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి గురించి ఆమె భావోద్వేగంతో ఓ పోస్ట్ చేపట్టారు. ‘మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాన్నా’ ఆని ఆమె అన్నారు. కేడీ చంద్రన్ నేర్పించిన విలువలు, నియమాలను తాము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు. కేడీ చంద్రన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wd3piE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...