Thursday, 13 May 2021

అదీ సల్మాన్ భాయ్ సినిమా రేంజ్.. ‘రాధే’ దెబ్బకు స్తంభించిపోయిన ఓటీటీలు!

బాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ వ్యాప్తంగా ఆయన్ని కోట్లాది మంది అభిమానిస్తారు. ఆయన సినిమా విడుదలవుతుందటే.. ఆ థియేటర్ వద్ద పండుగ వాతావరణం ఉంటుంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సల్మాన్ భాయ్ సినిమాని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. అయితే సల్మాన్ నటించిన రీసెంట్ చిత్రం ‘’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్). ఈద్ కానుకగా ఈ సినిమా గురువారం (మే 13న) విడుదలైంది. థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ సినిమాను విడుదల చేశారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కారణంగా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో థియేటర్లు మూసివేశారు. ఇక తెరిచి ఉన్న చోట్ల కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లి సినిమా చూసేందుకు జనం భయపడుతున్నారు. ఎక్కువశాతం ఓటీటీల్లోనే సినిమా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ‘రాధే’ సినిమా ‘జీ5’, ‘జీప్లెక్స్’ ఓటీటీల్లో విడుదల కాగానే.. దాన్ని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే చాలా మంది లాగిన్ అయ్యే ప్రయత్నం చేయడంతో.. రెండు ఓటీటీల సర్వర్లు.. స్తంభించిపోయాయి. అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణాలు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్విటర్‌లో పేర్కొంది. కొంత సమయం తర్వాత సర్వర్లు యధావిధిగా పని చేయడంతో ప్రేక్షకులు సినిమాను ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించారు. ‘రాధే సినిమాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్‌లో జీ5 తెలిపింది. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. రణ్‌దీప్‌ హుడా, మేఘా ఆకాశ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3br9YGm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...