Thursday, 13 May 2021

చంద్రబాబు గురించి మీకెందుకు దూల, దురద.. స్వరం మార్చిన పృథ్వీ షాకింగ్ కామెంట్స్

తిరుపతిలో కొంతమంది తన వెంటే ఉండి వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ SVBC చైర్మన్ . తనని చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తున్నాడని పొగిడిన వాళ్లే నట్టేట ముంచేశారని.. కుక్కకి ఉన్న విశ్వాసం కూడా వాళ్లకి లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు పృథ్వీ. అయితే తనకి పదవి ఉన్నా లేకపోయినా.. వైసీపీలోనే ఉంటానని.. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించారు పృథ్వీ. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్య లోకల్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు కెమెరా తెచ్చి ముఖం మీద పెట్టి.. చంద్రబాబు గురించి మాట్లాడండి అని అంటున్నారు. చంద్రబాబు గురించి నేను మాట్లాడను.. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు. ఆయన గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పాల్గొంటే నీకెందుకు దూల. అంత దురద ఎందుకు మీకు నాకు అర్థం కాదు. ఆయన పార్టీ అధ్యక్షుడు ఎక్కడైనా తిరుగుతాడు అది ఆయన ఇష్టం. అది అతని హక్కు.. కావాలనుకుంటే ఎక్కడైనా ప్రచారం చేసే హక్కు పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఉంది. మన పార్టీ ఎలా పనిచేస్తుంది.. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి కావాలి కానీ.. అవన్నీ వదిలేసి చంద్రబాబు గురించి మాట్లాడటం దేనికి? ఆయనే కాదు వేరే వాళ్ల ప్రస్తావన కూడా అనవసరం. ఇక విషయానికి వస్తే.. చాలామంది సినిమాలు చేసుకోవచ్చు కదా.. రాజకీయం ఎందుకు అని అంటున్నారు. సినిమాలు అనేవి ఆయన వృత్తి. క్రికెట్ ఇండియా తరుపున ఆడతారు.. అది లేనప్పుడు ఐపీఎల్ ఆడతారు.. లేదంటే ఇంకోటి ఆడతారు. రాజకీయం కూడా అంతే. జగన్ మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే.. స్టైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు.. పేద ప్రజలు.. వాళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు వీటిపైనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు అయితే బాగా చేశాం అని అంటారు. ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా.. ముఖ్యమంత్రి వచ్చినా.. సంక్షేమం, పేదరికం, మహిళా సంక్షేమంపై ఫోకస్ పెడితే పాస్ మార్కులు పడతాయి. పవన్ కళ్యాణ్‌ని వైసీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్నారంటే.. అదేం పెద్ద లెక్కకాదు... ట్రోలింగ్స్ ఈరోజుల్లో కామన్. వాటిని మేం పట్టించుకోము. ఎవరి దుకాణం వాళ్లది. ఎవరి దుకాణం వాళ్లు చూసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో లోకేష్ బాబులో మార్పు పెద్దగా కనిపించడం లేదు. కాస్త సైజ్ తగ్గించాడు తప్పితే మాటతీరు అలాగే ఉంది. సరైన సూచనలు ఇస్తున్నట్టు అయితే కనిపించడం లేదు. విమర్శలు తప్ప ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేట్టుగా కనిపించడం లేదు’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పృథ్వీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w6pgrE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...