Sunday, 9 May 2021

శ్రీరెడ్డి ఇష్యూపై అభిరామ్ ఓపెన్ ఇంటర్వ్యూ.. ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం మూవీలో

దగ్గుబాటి వారసుడు.. రామానాయుడు మనువడు.. సురేష్ బాబు కొడుకు.. రానా తమ్ముడు అభిరామ్‌ బర్త్ డే నేడు (మే 9). ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అభిరామ్.. తన లైఫ్‌లో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయ్యాడు. పశ్చాత్తాప పడుతూ.. తాను తప్పు చేశానని.. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని బయటకు లాగడం కరెక్ట్ కాదని అన్నారు అభిరామ్. ఆయన మాట్లాడుతూ.. ‘నేను నార్మల్ హీరోగా మాత్రమే ఉండాలని అనుకుంటున్నా.. రామానాయుడు మనవడ్ని, సురేష్ బాబు కొడుకుని అనే ఇంపార్టెన్స్ వద్దు నాకు. నాకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది. ముఖ్యంగా ఆ లవ్ స్టోరీలో మంచి కంటెంట్ ఉన్న మెసేజ్ ఉండాలి. నేను చేయబోయే సినిమాలో కంటెంట్ ఉంది.. త్వరలో మీరు చూస్తారు. ఈ సినిమాలో నా గతాన్ని రివీల్ చేసినట్టు అనిపిస్తుంది. మొదటి సినిమాలో నా లైఫ్ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఈ సినిమా ద్వారా నా రియల్ లైఫ్ కూడా మార్చుకోవచ్చు. నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఈ జనరేషన్‌కి నేను చెప్పేది ఏంటంటే.. దూకుడు వద్దు.. మన వల్ల వేరే ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకూడదు. ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది.. వాళ్ల పేరు పోతుంది. ఒకరి వల్ల ఫ్యామిలీకి చెడ్డపేరు వస్తుంది. కేవలం నేను చేసిన మిస్టేక్ వల్ల పేరెంట్స్ పేర్లు బయటకు వస్తుంది. పలానా వాళ్ల కొడుకు, పలానా వాళ్ల తమ్ముడు అని వాళ్ల పేర్లు ఎందుకు చేస్తారు. ఒక యాక్సిడెంట్ చేస్తే అది నా మిస్టేక్. నేను చేస్తే నా పేరు మాత్రమే రావాలి. ఫ్యామిలీ పేరు రాకూడదు. నా లైఫ్‌లో జరిగిన బ్లాక్ మెయిల్ అనేది అందరి లైఫ్‌లోనూ ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొంతమంది బయటపడరు. మనం జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్‌కి ఎలా భయపడుతున్నామో.. ఎదుటి వాళ్ల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేని చోట ఇంకా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చాడు అభిరామ్. అయితే అభిరామ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. మన లేడీస్ శ్రీరెడ్డి ఎలా ఉంది? అంటూ సెటైర్లు వేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R9peR3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...