Sunday, 9 May 2021

ఇక్కడే ఫుల్ బిజీ.. బాలీవుడ్‌కి టైం ఇవ్వలేకపోతున్న నవీన్ పొలిశెట్టి

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో తన కెరీర్‌ని ప్రారంభించిన .. ఇక్కడ పెద్దగా ఆఫర్లు లభించకపోవడంతో ముంబై బాట పట్టాడు. అక్కడ అతనికి పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో అతను తన టాలెంట్‌ని ప్రదర్శించడానికి యూట్యూబ్‌ని మాద్యమం చేసుకున్నాడు. పలు కామెడీ వీడియోలు, సందేశాత్మక వీడియోలు చూస్తే.. దర్శక నిర్మాత దృష్టిలో పడ్డాడు. దీంతో అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం వచ్చింది. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే అతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లాడు. అక్కడ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోరే’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు నవీన్. యాసిడ్ పేరుతో రూపొందిన ఈ పాత్రలోనూ నవీన్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత తన దశ తిరిగింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై కేవీ అనుదీప్ హీరోగా అతను ‘’ అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం కొట్టేశాడు. అప్పటికే నవీన్‌కి సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా వాయిదాపడటంతో.. దొరికన ఖాళీ సమయాన్ని సినిమా ప్రమోషన్లకు వాడుకున్నాడు. దీంతో విపరీతమైన హైప్‌తో విడుదల అయిన జాతిరత్నాలు సినిమా.. తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ.. భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత నవీన్ స్టార్ అయిపోయాడు. తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే మరోవైపు అతనికి బాలీవుడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నాయట. కానీ, తెలుగులో సినిమాలతో బిజీ అయిపోయిన కారణంగా అతను బాలీవుడ్‌కి టైమ్ కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సైన్ చేసిన సినిమాలు పూర్తైన తర్వాత అతను హిందీ సినిమాలకు ఓకే చెప్పనున్నాడని టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xWanKv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...