Sunday, 9 May 2021

అందులో ఇంత సంతృప్తి ఉంటుందని తెలియదు.. మంచు లక్ష్మీ కామెంట్స్ వైరల్

సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి అల్లరి చేసే వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి వర్కవుట్లు చేస్తుంటారు. యోగాసానాలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక విద్యా చేసే అల్లరిని మంచు లక్ష్మీ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు చూపిస్తుంటూనే ఉంటారు. తాజాగా మంచు లక్ష్మీ ఓ పోస్ట్ చేశారు. నేటి మదర్స్ డే స్పెషల్‌గా తన కూతురు ఇచ్చిన సర్ ప్రైజ్‌కు మంచు లక్ష్మీ ఫిదా అయ్యారు. ఈ మేరకు కూతురి ప్రేమను చూసి ఆమె మురిసిపోయారు. ఇక అమ్మ మీద ప్రేమను విద్యా నిర్వాణ తన ముద్దు ముద్దు మాటలతో, చిట్టి చేతులతో రాసి ఓ లెటర్ రూపంలో ఇచ్చేసింది. దాన్ని చూసిన మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. డియర్ అమ్మా.. హ్యాపీ మదర్స్ డే.. ఐ లవ్యూ సో మచ్.. ఈ ప్రపంచంలో అందరి కంటే నువ్వే గొప్ప తల్లివి.. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటావ్. హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ నిర్వాణ తన ప్రేమను కురిపించారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ చెబుతూ.. ‘ఓ తల్లిగా ఇంతటి సంతృప్తి ఉంటుందని నాకింత వరకు తెలియలేదు.. పిల్లలను పెంచడంలో తల్లి పడే కష్టాల గురించి నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ప్రతీ ఒక్కరికీ వారి శైలి అంటూ ఉంటుంది.. వారు ఎలా ఎదగాలి అనుకుంటారో అలానే ఎదగనివ్వాలి.. వారికి ఆ స్వేచ్చను ఇవ్వాలి. ఇలా గొప్ప తల్లిని అనే టైటిల్‌ను నాకు నా కూతురు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నీ ప్రేమకు ఎంతో మురిసిపోతోన్నాను. నీ జోకులతో నన్ను నిత్యం నవ్విస్తుంటావు.. నువ్ ఇంకా ఎదగాలి.. నీతో ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలి.. నీకు తల్లిగా నన్ను నువ్వు ఎంచుకున్నందుకు థ్యాంక్స్. నువ్ నాకు దొరకడం నా అదృష్టం’ అంటూ మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SCXZ1P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...