Sunday, 9 May 2021

ఆ పనులు చేసే ముందు నీ భార్యతో చెప్పు.. ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే! నెటిజన్‌కి థమన్ స్ట్రాంగ్ కౌంటర్

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందించడమే గాక, తన సినిమాల తాలూకు విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే థమన్ హవా నడుస్తోంది. వరుస హిట్స్ పట్టేస్తూ జనాలతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పిలిపించుకుంటున్నారు. మరోవైపు థమన్‌కి ఉన్న 'కాపీ క్యాట్' అనే నేమ్ కొనసాగుతూనే ఆయనపై పలు రకాల మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ పోస్ట్ చేసిన మీమ్ చూసి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు థమన్. నిజానికి థమన్ ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు అనుకోని విదంగా విమర్శల పాలవుతున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ఇతర భాషల్లో హిట్ అయిన ఇంటర్నేషనల్ సాంగ్స్‌ను కాపీ కొట్టేస్తున్నారనే ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ మీమ్ క్రియేట్ చేసి నేరుగా థమన్‌కి ట్యాగ్ చేయడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. కాపీ కొడితే మా అమ్మ అన్నం పెట్టదు అనే డైలాగ్ అప్పట్లో బాగానే ట్రెండ్ అయ్యింది. ఓ నెటిజన్ 'కింగ్' సినిమాలోని జయసూర్య (బ్రహ్మానందం) ఫొటోలను జత చేసి నా పిల్లలకు థమన్ ఇలా ఉంటాడని చెబుతానని కామెంట్ చేశాడు. ఇది చూసిన థమన్.. ''ఇలాంటివి చేసే ముందు ఓ సారి నీ భార్యకు చెప్పు బ్రో, మీమ్స్‌తో బిజీగా ఉన్నాను అని. తప్పకుండా ఆమె ఒక పనికిరాని మీమర్‌ని పెళ్లి చేసుకున్నానని గర్వ పడుతుంది'' అని పేర్కొంటూ సదరు నెటిజన్ క్రియేట్ చేసిన మీమ్‌ని ట్యాగ్ చేశాడు. థమన్ ఇచ్చిన ఈ కౌంటర్ చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఏంటి థమన్ అన్నా నువ్వు కూడా హర్ట్ అవుతున్నావా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SDS3Wl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...