Thursday, 6 May 2021

ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతూ.. గొప్ప మనస్సు చాటుకున్న సన్నీ లియోనీ

అందంతో పాటు గొప్ప మనస్సు ఉన్న నటి . ఆమె గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందరో విమర్శలు చేస్తున్న.. తనదైన శైలీలో ప్రతిభను కనబరుస్తూ.. బాలీవుడ్‌లో స్టార్ హోదా సంపాదించుకుంది. ఇక మానవత్వం విషయంలో సన్నీ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఎన్నో సందర్భాల్లో ఆమె ఉదారతను చాటుకుంది. ఎన్నో ఛారిటీలకు విరాళాలు అందించడమే కాక.. సేవా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సన్నీతో పాటు ఆమె భర్త డేనియల్ కూడా సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా దర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పని దొరక్కా.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు అవస్తలు పడుతున్నారు. చాలా మంది సరైన సమయానికి ఆహారం దొరకకపోవడంతో కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకొనేందుకు సన్నీ ముందుకు వచ్చింది. (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియాతో కలిసి ఉదయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పది వేల మందికి భోజనానలు ఆమె అందిస్తుంది. పూర్తిస్థాయిలో పౌష్టికంగా ఉండే శాఖహార భోజనాన్ని దిల్లీలో ఉండే వలస కార్మికులకు వీళ్లు అందించనున్నారు. ఈ విషయంపై సన్నీ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం మనం సంక్షోభంలో ఉన్నాము. ఇలాంటి సమయంలో మనం కరుణ, సంఘీభావంతో ముందుకు వెళ్లాలి. పెటా ఇండియాతో కలిసి పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ఈసారి వేలాది మంది వలస కార్మికులకు మంచి పౌష్టికాహాం అందించబోతున్నాం. ఈ సమయంలో వారికి అది అవసరం’’ అని తెలిపింది. జిస్మ్‌-2 సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సన్నీ.. కొంత సమయంలో స్టార్‌గా మారిపోయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, ఇతర భాషల చిత్రల్లోనూ ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘షెరో’, ‘రంగీలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, హిందీల్లో రూపొందుతున్న ‘హెలెన్’, ‘కోకాకోలా’ సినిమాలు చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nWWN4P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...