Thursday, 6 May 2021

సమంత బాటలో ఇలియానా.. భారీ డీల్ కుదుర్చుకొని ముహూర్తం పెట్టేసిన గోవా బ్యూటీ!

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన గోవా బ్యూటీ మరో అడుగు ముందుకేస్తోందని తెలుస్తోంది. అక్కినేని కోడలు సమంత బాటలో ఈ అమ్మడు వెళ్లబోతోందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. హాట్ హీరోయిన్‌గా వెండితెరపై అలరిస్తూనే సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ ముద్దుగుమ్మ.. డిజిటల్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏడాదికి పైగా కరోనా విలయతాండవం ఆగకపోవడంతో జనం ఎవ్వరూ బయటకు రావడం లేదు. థియేటర్స్ బోసి పోతున్నాయి. ఈ పరిస్థితులు డిజిటల్ మాధ్యమాలకు బాగా కలిసొచ్చాయి. డిజిటల్ వేదికలపైనే ఎంటర్‌టైన్‌మెంట్ బెటర్ అనే భావన అందరిలో మొదలు కావడంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఈ వేదికపై వాలుతున్నారు. డిజిటల్‌లో వెబ్‌ సీరీస్‌లతో పాటు టాక్‌ షోలకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. దీంతో ఓ వైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై సందడి చేస్తున్నారు స్టార్స్. ఇప్పటికే 'సామ్ జామ్' అనే ప్రోగ్రాం ద్వారా 'ఆహా' ఓటీటీ వేదికపై అక్కినేని కోడలు సమంత అల్లరల్లరి చేసి భేష్ అనిపించుకుంది. ఇప్పుడు అదే బాటలో వెళుతోందట ఇల్లీ బేబీ. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో కోసం ఇలియానా ఓ టాక్‌ షో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇలియానాతో సంప్రదింపులు కూడా ఫినిష్ చేశారని, ఈ షో కోసం మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఈ టాక్‌షో నడవనుందని, మొదట ఓ సీజన్‌ని షూట్‌ చేసి విడుదల చేశాక, దానికి వచ్చే రెస్పాన్స్ చూసి మరో సీజన్‌ కూడా ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ టాక్ షో చేసేందుకు ఇలియానా భారీగానే ఛార్జ్ చేసిందని తెలుస్తోంది. సో.. చూడాలి మరి సమంత లాగే ఇల్లీ బేబీ కూడా ముద్దుముద్దు మాటలతో మాయ చేస్తుందా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rz7P4o
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...