Monday, 3 May 2021

క్వారంటైన్‌లో కొంటె చేష్టలు.. ఫుల్ చిల్ అవుతోన్న పూజా హెగ్డే

ప్రస్తుతం కరోనా విజృంభణ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు వీరు అని తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. కరోనా ఓ వైపు దాడి చేస్తుంటే.. మరో వైపు వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్ సరఫరా లేక ఎంతో మంది ప్రాణాలను వదిలేస్తున్నారు. అయితే సెలెబ్రిటీలనూ ఈ కరోనా వదలడం లేదు. టాలీవుడ్ బుట్టబొమ్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత వారంలోనే ఈ విషయాన్ని పూజా హెగ్డే ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు కనిపించాయని, పరీక్షించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే కోరారు. అలా తాను క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని పూజా హెగ్డే పేర్కొన్నారు. క్వారంటైన్‌లో పూజా హెగ్డే ఫుల్ చిల్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య పూజా హెగ్డే యోగాసానాల గురించి చెబుతూ వీడియోను షేర్ చేశారు. కరోనా సమయంలో శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయని, వాటిని అధిగమించేందుకు ఉపయోగపడే ఆసనాలంటూ పూజా హెగ్డే అందరికీ అవగాహన కల్పించారు. అలా పూజా హెగ్డే తాజాగా కొన్ని కొంటె చేష్టలు చేశారు. క్వారంటైన్ లైఫ్ అంటూ చెబుతూ వీడియోను షేర్ చేశారు. కన్నుకొట్టేందుకు పూజా హెగ్డే తెగ ప్రయత్నించారు. కనుబొమ్మలు పైకి కిందకు చేస్తూ తన చేష్టలతో అందరినీ నవ్వించేశారు. ఇదే కాకుండా పుస్తకాలు కూడా చదువుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూాజా హెగ్డే ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33adRuH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...