Monday, 3 May 2021

కోవిడ్ దెబ్బ.. రవితేజా ‘ఖిలాడి’ రిలీజ్ వాయిదా.. మళ్లీ విడుదల ఎప్పుడంటే..

కరోనా మహమ్మారి ప్రభావం రెండో దశలో సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండంతో సినీ పరిశ్రమ కుదేలైంది. సిని పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారిన పడ్డారు. పలువురు ప్రాణాలు కూడా విడిచారు. ఇక కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించడంతో.. సినిమా షూటింగ్‌లు, విడుదలలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ సన్నిహితులకు కరోనా సోకడంతో పలువురు తారలు తమని తాము ఐసోలేట్ చేసుకున్నారు. తాజాగా విడుదల వాయిదా వేసుకున్న సినిమాల లిస్టులో ‘ఖిలాడి’ కూడా చేరింది. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు రవితేజా. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రవితేజా మాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లలో దూసుకుపోయింది. ఈ సినిమా చేస్తూనే రవితేజా మరో రెండు సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘’ ఒకటి. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. తొలుత ఈ సినిమాని మే 28న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉండటంతో సినిమా విడుదలను జూలై నెలకి వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఖిలాడీ’ సినిమాలో రవితేజా సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు, రమేశ్ వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిరించారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3edLGBh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...