Monday, 3 May 2021

‘నేను, నా కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తున్నాం.. మీరు అలా చేయకండి’ కృతి కర్బందా అభ్యర్థన

రెండో దశలో భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వైరస్ అంటుకుంటుంది. వైరస్ బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసారి వైరస్ ప్రభావం సినీ తారలపై గట్టిగా ఉంది. ప్రతీ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ‘తీన్‌మార్’ సినిమాలో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించిన వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా కృతి ఇందుకు సంబంధించి ట్వీట్ చేసింది. ‘గత 48 గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో వేదనని అనుభవిస్తున్నాం. మీకు అనుభవం అయ్యే వరకూ ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. మీ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారని తెలిసి వెనకడుగు వేయండి. ఇంట్లో ఉండే సుఖం ప్రతీ ఒక్కరికి లభించదు. మీ జీవితాన్ని, ప్రాణాన్ని సులభంగా తీసుకోకండి’ అంటూ కృతి ట్వీట్ చేసింది. అయితే ఇందులో తనకు వైరస్ సోకినట్లు స్పష్టంగా తెలపలేదు. కానీ ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెకు వైరస్ సోకిందనే భావిస్తున్నారు. ‘తీన్‌మార్’, ‘ఒంగోలు గిత్త’, ‘మిస్టర్ నూకయ్య’, ‘బ్రూస్ లీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి అటు తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇక ‘రాజ్ : రీబూట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది ఈ భామ. అక్కడ ఆమెకు మంచి సక్సెస్సే లభించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు. ఎక్కువ శాతం హిందీలో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తమిళం, కన్నడ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘వాన్’, హిందీతో ‘14 ఫెరే’ అనే సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/337lTV4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...