Friday, 14 May 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: డేంజరస్ గర్ల్స్‌తో వర్మ.. మంచు లక్ష్మి మ్యాజిక్.. చూపుల్తో గుచ్చేస్తున్న ప్రియాంక

డేంజరస్ అమ్మాయిలతో వర్మ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డేంజరస్’. నైనా గంగూలీ, అప్సరా రాణీ ప్రధాన పాత్రల్లో.. భారత్‌లో తెరకెక్కుతున్న తొలి లెస్బియన్ చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోయిన్లతో సినిమా షూటింగ్‌ సందర్భంలో దిగిన పలు ఫోటోలను వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. నాభి సొగసులతో గాలమేస్తున్న వర్షిణి షార్ట్ ఫిలిమ్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి వర్షణి.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన రీసెంట్ ఫోటోషూట్ పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ పిక్స్‌లో తన నాభి అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు గాలెం వేస్తోంది ఈ భామ. చూపుల్తో గుచ్చేస్తున్న ప్రియాంక.. ‘సవారీ’ సినిమా బ్యూటీ ప్రియాంక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. డిఫెరెంట్ స్టైల్‌లో ఫోటోషూట్‌లు చేస్తూ.. ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో.. కంటి చూపుతో గుచ్చెస్తూ.. ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మంచు లక్ష్మి మ్యాజిక్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వారిలో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటుంది. తనకి ప్రశంసలు వచ్చినా.. తనపై ట్రోలింగ్ వచ్చినా.. ఆమె సోషల్‌మీడియాను మాత్రం వదలదు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తొలుత చీర కట్టుకుంటూ కనిపించిన లక్ష్మి.. ఆఖర్లో ఓ మ్యాజిక్‌లా మాడ్రెన్ డ్రెస్‌లోకి మారిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. శర్మ సిస్టర్స్ హాట్ షో.. మాములుగా లేదు గురూ రామ్ చరణ్ సరసన ‘చిరుత’ సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మ.. ఊహించినంత సక్సెస్ సాధించలేదు. ఇటు తెలుగులోనూ.. అటు బాలీవుడ్‌లోనూ ఈ భామకి కలసి రాలేదు. అయితే అందాల ఆరబోతలో మాత్రం ఈ భామ ఎన్నడూ వెనకాడదు. తన సోదరి ఐషాతో కలిసి.. ఈ భామ హాట్ స్టిల్స్ ఇస్తూ.. ఆ ఫోటోలు.. వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకుంటుంది. తాజాగా వీరిద్దరు కలిసి.. ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ.. వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RU4XiF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...