Thursday, 20 May 2021

‘దీనికంటే ఆ పోస్టర్లే బాగున్నాయి..’ ఎన్టీఆర్ లుక్‌పై ఇలాంటి ఫీడ్‌బ్యాక్ ఊహించి ఉండరు!

సినిమాలు అంటే.. ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. తన ప్రతీ సినిమాతో డైరక్టర్‌గా తనని తాను ఓ మెట్టు ఎక్కించుకుంటూ వచ్చాడు. రాజమౌళీ. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళీ అంటే క్రేజ్ ఎంతో పెరిగిపోయింది. అయితే అంత గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘’. ఈ సినిమాలో స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుగా , గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా జూనియర్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని దేశమంతా ఎదురుచూస్తోంది. కానీ, చిత్ర యూనిట్ నుంచి వచ్చిన అప్‌డేట్లు తక్కువే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా గురువారం(మే 20)న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొమురం భీమ్ లుక్‌లో భీకరంగా కనిపిస్తుంది.. బల్లాన్ని ఎక్కుపెట్టిన ఎన్టీఆర్ పోస్టర్‌ని విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు పోస్టర్‌ అదిరిపోయిందటూ అంటుడగా.. మరికొందర మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ పోస్టర్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లే బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ అనే టీజర్‌పై కూడా ఇలాంటి ఫీడ్‌బ్యాకే వచ్చింది. రామ్ చరణ్ టీజర్‌తో పోలిస్తే.. ఈ టీజర్ చాలా పేలవంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అంతేకాక.. ఈ టీజర్ చివర్లో కొమురం భీమ్‌ను ముస్లింగా చూపించడంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి కొమురం భీమ్ పోస్టర్‌పై కూడా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం చిత్ర యూనిట్‌ ఊహించి ఉండదు. ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్‌కి హీరోయిన్‌గా ఆలియా భట్, ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా ఒలివియా మోరిస్ నటిస్తోంది. అజయ్ దేవ్‌గన్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నరు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదాపడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RxeUCJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...