Wednesday, 19 May 2021

తలపట్టుకున్న హీరోయిన్.. ఏడాదంతా అంతే అంటోన్న హెబ్బా పటేల్

ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. 2020లో కరోనా ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో.. అంతకు మించి అనేలా ఈ ఏడాది అందరినీ హడలెత్తిస్తోంది. 2020ని డిలీట్ చేసేయండి అని కొన్ని వేల మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసి గడిచిన ఏడాదే ఎంతో బెటర్ అని అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అలా తాజాగా ఓ కామెంట్ చేశారు. హెబ్బా పటేల్ ఇప్పుడు అంతగా ఫాంలో లేదు. కుమారి 21ఎఫ్ సినిమాలో హెబ్బా పటేల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే మళ్లీ ఆ స్థాయిలో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు. చివరకు ఓరేయ్ బుజ్జిగా అంటూ పలకరించారు. కానీ ఆ సినిమా కూడా అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓ చాలెంజింగ్ రోల్‌ను ఎంచుకున్నారు. ఓదేల రైల్వే స్టేషన్ అనే సినిమాలో డీ గ్లామర్ రోల్‌ను హెబ్బా పటేల్ పోషిస్తోన్నారు. ఈ మేరకు బయటకు వచ్చిన స్టిల్స్, లంగావోణి, చీరల్లో పల్లెటూరి పిల్లగా హెబ్బా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆ మూవీలోని ఓ స్టిల్‌ను షేర్ చేస్తూ ఓ కామెంట్ చేశారు. తల మీద చేతులు పెట్టుకుని.. ఇదెక్కడి కర్మరా బాబు అన్నట్టు ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఇక మిగిలిన ఈ ఏడాది అంతా కూడా ఇదే మూడ్ ఉంటుందేమో అనేట్టుగా చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f0mnDp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...