Wednesday, 19 May 2021

ఓహో పెళ్లిపై అలాంటి అభిప్రాయమా?.. కాజల్ రిప్లైతో బుక్కైన అనుష్క!

గత ఏడాది ఘనంగా వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న కాజల్ పెళ్లి తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లూతో ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలను అనుసరిస్తూనే అత్యంత సమీప బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక కాజల్ పెళ్లి విశేషాలు, ఫోటోలు, డిజైనింగ్ దుస్తులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పెళ్లికి సెలెబ్రిటీలు అందించిన విషెస్‌తో సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. కాజల్ గౌతమ్ పెళ్లి వార్తలు దాదాపు వారం రోజుల పాటు ట్రెండ్ అయ్యాయి. మాల్దీవుల్లో ఇద్దరి హనీమూన్ విశేషాలు మరింతగా అందరినీ ఆకట్టుకున్నాయి. వాటర్‌లో స్పెషల్ ఫోటో షూట్ చేయించుకోవడం, అండర్ వాటర్‌లో హనీమూన్‌ను ఎంజాయ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అలా కాజల్ పెళ్లికి కూడా విషెస్ తెలిపారు. ఆనాడు చెప్పిన విషెస్‌కు నేడు కాజల్ అగర్వాల్ స్పందించారు. ఇక కాజల్ ఇప్పుడు అలా రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు కాస్త ఆశ్చర్యపోయారు. కానీ ఇందులో అనుష్క పంపిన విషెస్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి అనుష్కకు పెళ్లిపై ఉన్న అభిప్రాయం ఇలా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అసలే అనుష్క పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్‌తో లింక్ పెడుతూ ఎప్పుడూ కూడా పెళ్లి వార్తలు వ్యాప్తిస్తుంటాయి. అయితే తాజాగా తనకు పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని చూసి అభిమానులు సంబరపడిపోతోన్నారు. ఈ భూమ్మీద అన్నింటికంటే ఎక్కువ సంతోషం పెళ్లి చేసుకోవడంలోనే ఉంది.. రెండు ఆత్మలు కానీ ఒకే ఒక్క ఆలోచన.. రెండు గుండెలు కానీ ఒకే శబ్దం అంటూ కాజల్, గౌతమ్‌లకు నాకు విషెస్ తెలిపారు అనుష్క. అలా అనుష్క వేసిన ట్వీట్‌కు కాజల్ ఇప్పుడు రిప్లై ఇచ్చారు. దీంతో అనుష్క పెళ్లి గురించి నెటిజన్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మీ పెళ్లి ఎప్పుడు? ఎవరిని చేసుకోబోతోన్నారు? త్వరగా చేసుకోండి అంటూ అభిమానులు అనుష్కకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qvwdn5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...