Friday, 7 May 2021

బాలయ్య బాబుతో మీనా రొమాన్స్.. అంతా పక్కాగా ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్! ఇదీ మ్యాటర్

అందం, అందుకు తగ్గ అభినయంతో ఒకానొక సమయంలో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించిన హీరోయిన్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదే హవా కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీలో ఆమెను సెలక్ట్ చేసి పక్కాగా ప్లాన్ చేశారట మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. సీనియర్ నటిగా, అంతకుమించి బాలయ్య పర్ఫెక్ట్ జోడీగా ఆకట్టుకున్న ఆమెతో నేటితరం ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఆయన స్కెచ్చేశారట. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుసపెట్టి సీనియర్ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు మీనా. ప్రస్తుతం రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'అన్నాత్తే'లో నటిస్తున్న ఆమె.. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆమె లేటెస్ట్ లుక్స్ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో బాలకృష్ణ సరసన మీనా అయితే బెటర్ అని భావించిన గోపీచంద్ మలినేని.. ఆమెను ఫైనల్ చేసే పనిలో పడ్డారట. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారని, చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం. అప్పట్లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో చాలా సినిమాలు చేశారు మీనా. తనదైన హావభావాలకు తోడు క్యూట్ లుక్స్‌తో అప్పటి యువతరాన్ని మెస్మరైజ్ చేశారు. దీంతో మరోసారి బాలకృష్ణ- మీనా జోడీ కట్టబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది. సో.. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు కనువిందే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uFiY2h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...