Friday, 7 May 2021

ఇటలీ షెడ్యూల్ కంప్లీట్.. రాశీ ఖన్నా, నాగ చైతన్య పిక్స్ వైరల్

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్‌లు చేయడం ఎంతటి ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇటలీ వెళ్లి.. ఇలాంటి కష్టకాలంలో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది thankyou టీం. , హీరోహీరోయిన్లు రాబోతోన్న ఈ మూవీని విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన స్టిల్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. thankyouలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటించనున్నాడని తెలుస్తోంది. వెంకీమామ సినిమా తరువాత మళ్లీ రాశీ ఖన్నా చైతూతో జోడి కడుతోంది. ఈ మూవీ కోసం కరోనా సెకండ్ వేవ్ వస్తోన్న సమయంలో యూనిట్ మొత్తం ఇటలీకి వెళ్లింది. అక్కడే గత నెల రోజులుగా షూటింగ్ చేసిన బృందం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటలీ షెడ్యూల్ పూర్తయిందని చెప్పుకొచ్చారు. ఇటలీ షెడ్యూల్ పూర్తయింది.. త్వరలోనే ఇంటికి రాబోతోన్నాం.. అంటూ కెమెరా మెన్ పీసీ శ్రీరాం షేర్ చేశారు. టీం అంతా కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. రాశీ ఖన్నా కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. నాగ చైతన్యతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇటలీ షెడ్యూల్ పూర్తయిందని రాశీ ఖన్నా చెబుతూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మళ్లీ జూన్‌లోనే హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసినట్టు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PVsqPG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...