Monday, 10 May 2021

‘మదర్స్ డే రోజు ఇలాంటి ఫోటో పెడతావా..’ లైగర్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు!

అంతర్జాతీయ మాతృ దినోత్సవం ఆదివారం (మే 9న) జరిగింది. ఈ సందర్భంగా తమ తల్లిపై ఉన్న ప్రేమను ఒకొక్కరు ఒక్కో విధంగా చాటిచెబుతూ.. సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు. సెలబ్రిటీలు కూడా తమ తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. అందరికీ విషెస్ చెప్పారు. తమ జీవితంలో తల్లి ఎంత ముఖ్యభూమిక పోషించిందో వాళ్లు ఈ పోస్టుల ద్వారా వెల్లడించారు. అయితే అందరిలానే బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమార్తె.. కూడా తన తల్లితో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ.. విషెస్ చెప్పింది. కానీ, ఈ పోస్ట్‌ వల్ల ఆమె ఇప్పుడు విమర్శలు ఎదురుకుంటుంది. మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి యుక్త వయస్సులో ఒక బీచ్‌లో బికినీ ధరించిన ఉన్న ఫోటోని అనన్య షేర్ చేసింది. ‘లవ్ మమ్మా’ అంటూ ఈ పోస్ట్‌కి ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌ని పాజిటివ్‌గా తీసుకున్న కొందరు శుభాకాంక్షలు చెబుతూ.. రియాక్ట్ అయ్యారు. కానీ, ఇది చూసిన మరికొందరు నెటిజన్లు అనన్యపై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. మదర్స్‌ డే రోజున ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మదర్స్‌ డే రోజున షేర్ చేసేందుకు తన తల్లికి సంబంధించి ఇంతకంటే మంచి ఫోటో మరొకటి దొరకలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అనన్యకు ఆ సినిమా నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం ఆమె పూరీ జగన్నాథ్, కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అనన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఈ సినిమాని పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tBApiJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...