దేశ వ్యాప్తంగా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఏ ఒక్కరినీ కరోనా మహమ్మారి వదలడం లేదు. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే షూటింగ్స్ అన్నీ వాయిదా వేసినా పలువురు సినీ నటులు మహమ్మారి బారిన పడుతుండటం సినీ లోకంలో కంగారు పుట్టిస్తోంది. రీసెంట్‌గా అల్లు అర్జున్ కోవిడ్ బారిన పడగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు ఎన్టీఆర్. ''నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. నేను, నా ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారంటైన్ అయ్యాం. డాక్టర్ల సూచనల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరూ కరోనా టెస్ట్ చేయించుకోండి. సేఫ్‌గా ఉండండి'' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vXRXHd
v
No comments:
Post a Comment