రాజ్ పుత్, ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. పాయల్ తన సినిమా షూటింగ్‌ల కోసం ఎక్కడికి వెళ్లినా సరే ఆమె వెంటే ఉంటారు సౌరభ్. ఇద్దరూ ఒకే రూంలో ఉంటారు. అయితే వీరి రిలేషన్ మీద ఎన్ని రకాల పుకార్లు వచ్చినా కూడా ఎప్పుడూ స్పందించరు. ప్రేమా? స్నేహమా? అన్నది ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇరువురు తమ తమ పుట్టిన రోజుల నాడు చేప్పుకునే విషెస్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. నువ్వే నాకు లోకం.. నువ్ దొరకడం నా అదృష్టం వంటి పెద్ద పెద్ద పదాలను వాడుతుంటారు. ఇద్దరూ కూడా మోడలింగ్, నటన రంగానికి చెందిన వారే. పాయల్ తన ప్రియుడితో కలిసి షేర్ చేసే వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. హోటల్ రూంలో ఈ ఇద్దరూ చేసే అల్లరి సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. హోటల్ రూంలో తన ప్రియుడిని ఎంతలా విసిగిస్తున్నారో తెలియజేసే వీడియోలను పాయల్ ఆ మధ్య షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పాయల్ కొన్ని పోస్ట్‌లు చేశారు. వాటిని గమనిస్తుంటే.. ఏదో జరిగినట్టే కనిపిస్తుంది. సౌరభ్ థింగ్రా తల్లి అనితా థింగ్రా అనారోగ్యానికి గురైనట్టున్నారు. ఈ క్రమంలో పాయల్ తెగ ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాయల్ చేసిన పోస్ట్‌లు అందరినీ కదిలిస్తున్నాయి. ప్లీజ్ అందరూ అనితా థింగ్రా కోసం ప్రార్థనలు చేయండి.. ప్రార్థనలు అద్భుతాలు సృష్టించగలవు.. ఆమె కోసం ప్రార్థించండి.. దేవుడా దయచేసి అలా చేయకు.. అని పాయల్ ఎమోషనల్ అయ్యారు. ఇక తాజాగా ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయినట్టుంది. ఢిల్లీలోని సోనపేట్ ఏరియాలో ఓ వెంటిలేటర్ బెడ్, అంబులెన్స్ అవసరం ఉంది.. ఎవరైనా ఉంటే సాయం చేయండి అని వేడుకున్నారు. ఇదంతా చూస్తుంటే అనితా థింగ్రా కరోనాతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bdDoHD
v
No comments:
Post a Comment