Sunday, 9 May 2021

కరోనా వైరస్‌కి ఎలాంటి బేధాలు ఉండవు.. రియా చక్రవర్తి లేటెస్ట్ కామెంట్స్

రెండో దశలో వ్యాప్తి ప్రతీ ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు, ఎవరికి, ఏ క్షణంలో వైరస్ సోకుతుందా అని ప్రతీ ఒక్కరు భయపడుతున్నారు. ప్రతీ రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడ్డారు. కొందరు సెలబ్రిటీల కుటుంబ సభ్యులు, బంధువులు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ నటి అంకుల్ సురేశ్ కుమార్ కరోనా సోకి మృతి చెందారు. ఈ సందర్భంగా రియా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ‘‘రిటైర్డ్ కల్నల్ సురేశ్ కుమార్ విఎస్‌ఎమ్. పేరు మోసిన ఆర్థోపెటిక్ సర్జన్, అధికారి, గొప్ప తండ్రి.. గొప్ప మనస్సు ఉన్న మనిషి. మిమ్మల్ని కోవిడ్ మా నుంచి దూరం చేసి ఉండొచ్చు.. కానీ మీ వారసత్వం కొనసాగుతుంది. సురేశ్ అంకుల్.. మీరు రియల్ హీరో. మీకు నా సెల్యూట్’’ అంటూ రియా పోస్ట్ చేసింది. ‘‘ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి.. కోవిడ్‌కి మంచి.. చెడు అనే బేధాలు లేవు’’ అంటూ ఆమె జత చేసింది. ఈ పోస్ట్‌పై రియా మిత్రులు, తోటి నటీనటులు ‘ఆర్.ఐ.పీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత రియా చక్రవర్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సుశాంత్ ఆత్మహత్య, డ్రగ్స్‌ కేసుల్లో ఈ పాత్ర ఉందని భావించిన అధికారులు ఆమెని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దాదాపు నెల రోజుల జైలు శిక్ష అనుభవించిన ఆమె.. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో రియాకు బాలీవుడ్‌లో ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె తెలుగులో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33q6Xlf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...