Wednesday, 5 May 2021

బాలయ్య కోసం మాస్ డైరెక్టర్ స్కెచ్.. వెండితెరపై నందమూరి హీరో హంగామాను ఇలా ప్లాన్ చేశారట!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్న నందమూరి నటసింహం .. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. మాస్ ఆడియన్స్ చేత గోల పెట్టించడమే టార్గెట్‌గా యమ స్పీడుగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాను 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఫిక్స్ చేసుకున్నారు బాలయ్య బాబు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ- కాంబోలో సినిమా అతిత్వరలో ప్రారంభం కానుందని మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ పేర్కొనడంతో సినీ వర్గాల్లో ఈ సినిమా గురించిన చర్చలు మొదలయ్యాయి. ఇందులో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని, ప్రస్తుతం వారిని ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ ఉన్నారని అంటున్నారు. అలాగే, మిగిలిన నటీనటుల గురించి కూడా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్‌కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ మూవీ కోసం ప్రకాశం జిల్లాకు చేరుకున్న దర్శకుడు.. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలను తిరగేసి మరీ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ మాస్‌ పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. అతిత్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సో.. అఖండతో పాటు ఇందులో కూడా బాలయ్య మాస్ గెటప్ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ కానుందన్నమాట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2StstDp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...