ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందంటూ గత వారం ప్రకటించిన బన్నీ.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితి మీద మరో పోస్ట్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, ఇంకా క్వారంటైన్‌లొనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని, మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. అయితే దీని కంటే ముందు బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఆడుకోవడం, అందరూ ఒకే చోట ఉండటం, పిల్లలు, భార్య ఆడుకుంటూ ఉంటే ఆ వీడియోలను బన్నీ షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అయ్యాయి. ఇలా బన్నీ తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండటంతో కరోనా తగ్గి ఉంటుందని అందరూ అనుకున్నారు. వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు బన్నీ పోస్ట్ చేశారు. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజాగా బన్నీ మరో వీడియోను షేర్ చేశారు. ఇందులో అర్హ తన తండ్రి కోసం గరిట పట్టేశారు. వంటింట్లోకి దూరి బన్నీ కోసం దోశలు వేశారు. దోశలు వేయడం బహుషా నా దగ్గరే నేర్చుకుని ఉంటుందని రాములో రాముల స్టెప్పులను గుర్తుకు చేసుకున్నారు. రాములో రాములో స్టెప్పులను దోశ స్టెప్పులంటూ ఆ మధ్య అర్హ గాలి తీసేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ముద్దుల కూతురు అలా దోశలు వేస్తుండటంతో బన్నీ మురిసిపోయారు. అలా అర్హ వేసిన దోశను చూపిస్తూ ఇది ఎప్పటికీ మరిచిపోలేని దోశ అంటూ సంబరపడిపోయారు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని మెప్పించేందుకు వస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h4lWcC
v
No comments:
Post a Comment