Sunday, 2 May 2021

మరో స్టార్‌తో సినిమాకి రెడీ అవుతున్న త్రివిక్రమ్.. ఈ కాంబోలో సినిమా వస్తే.. ఫ్యాన్స్‌కి పండుగే

తన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’తోనే తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన సినిమా అంటే పంచులు, ప్రాసలతో కూడిన డైలాగ్స్‌తో పాటు మంచి విలువలతో కూడిన సందేశం కూడా ఉంటుంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతీ వర్గానికి చెందిన ప్రేక్షకులు త్రివిక్రమ్ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. అలా ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు త్రివిక్రమ్. గత ఏడాది అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నారు త్రివిక్రమ్. అయితే ఆ తర్వాత ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ సినిమాకి ‘అయిననూ వెళ్లి రావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే అని కొద్ది రోజుల క్రితం తేలిపోయింది. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అయితే శనివారం త్రివిక్రమ్ తన అభిమానులకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఆయన త్వరలో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఈ సంబరాల్లో ఉన్న అబిమానులకు మరో సర్‌ప్రైజ్ త్వరలో అందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ త్వరలో మరో స్టార్ హీరోతో సినిమా చేయనున్నారట. అతను మరెవరో కాదు పవర్‌స్టార్ పవన్‌‌కళ్యాణ్. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌కు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. మరోవైపు పవన్‌ వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా ఓకే అయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు రాగా అందులో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు వీరి కాంబోలో మరోసారి అలాంటి సినిమానే వస్తే.. ఫ్యాన్స్‌కి ఇక పండగే అని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xzh8l8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...