తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాల సిరీస్ ఏదైనా ఉందంటే.. అది రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన సిరీసే. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్ జోనర్‌లో రూపొందే ఈ సినిమా సిరీస్‌లో అద్భుతమైన కామెడీతో పాటు మంచి సందేశం అందించే ప్రయత్నం చేస్తాడు లారెన్స్ దీంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ కాంచన సిరీస్‌కి మంచి క్రేజ్ ఉంది. అయితే కాంచన అంత కాకపోయినా.. దర్శకుడు సుందర్.సి రూపొందించే ‘’ సిరీస్ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సినిమాలు వచ్చాయి. త్వరలో మూడో సినిమా కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండు సినిమాల్లో హన్సిక ఆత్మ పాత్రలో నటించగా.. మొదటి సినిమాలో ఆండ్రియా, లక్ష్మీ రాయ్, రెండో భాగంలో త్రిష హీరోయిన్లుగా చేశారు. ఇక మూడో సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆండ్రియా ఆత్మగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా కనిపించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా తర్వాత ‘అరణ్మనై-4’ కూడా ప్లాన్ చేస్తున్నరట సుందర్.సి. మూడో సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నయనతారను అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెతో దీనిపై చర్చ కూడా జరిపినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార సరైన హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు అరణ్మనైకి ఓకే చెబితే.. సినిమా క్రేజ్ పెరగడమే కాదు.. హిట్ కూడా పక్క అనే టాక్ కోలివుడ్‌లో వినిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QEyZ9T
v
No comments:
Post a Comment