Friday, 21 May 2021

శతఘ్ని ట్రైలర్: లవ్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయ్.. ఇదో మోడ్రన్ కథ!!

వాట్ నెక్స్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎల్. వి. శివ దర్శకత్వంలో అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం '' . 2010 సంవత్సరంలో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో స్వాతి మండల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కంచరపాలెం ఫేమ్ సుబ్బారావు, కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో 'ఫ్రాడ్ స్టోరీ బై బ్యాడ్ పీపుల్' అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. టెక్నాలజీ వాడుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరు యువకుల కథను ఆసక్తికరంగా మలిచారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తమ సినిమా ఉంటుందని, చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారని దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wpb39s
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...