Friday, 21 May 2021

మన చుట్టూ అలాంటి పరిస్థితులే!.. బుల్లి సితార ఫోటోతో నమత్ర రచ్చ

ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. అయితే ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు. ఆక్సిజన్ అందక కూడా ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ధైర్యాన్ని కూడదెచ్చుకోవాలి. భవిష్యత్తు మీద ఆశలు కలిగేలా చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి చెబుతూ.. ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం మన చుట్టూ బాధలు, దుర్భర పరిస్థితులే ఉన్నాయి.. అయితే ఇలాంటి సమయంలో ఈ రోజు నా మొహం మీద చిరునవ్వును తీసుకొచ్చింది ఈ ఫోటో. ఇవన్నీ కూడా అద్భుతమైన మెమోరీస్. మీరు కూడా అలాంటి వాటిని వెతికి చూసుకోండి.. కాస్త నవ్వేందుకు ప్రయత్నించండని నమత్ర చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది సైతం లాక్డౌన్ సమయంలో నమత్ర చేసిన హల్చల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, చిన్ననాటి అల్లరి చేష్టలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక మహేష్ బాబు ఇంట్లో తన పిల్లలతో కలిసి ఎంత అల్లరి చేస్తారో చూపించారు. అలా ఇప్పుడు మెమోరీ థెరపీ అంటూ మళ్లీ పాత ఫోటోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం బుల్లి సితార ఫోటోను చూసి అంతా షాక్ అవుతున్నారు. సితార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మహేష్ బాబు అభిమానులు మురిసిపోతోన్నారు. ఇక మంజుల ఘట్టమనేని సైతం ఈ ఫోటోపై ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u1Lf1K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...