Friday, 21 May 2021

రాధికా ఆప్టే న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

టాలెంటెడ్ అండ్ బోల్డ్ యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు హిందీ, తెలుగు, తమిళ, మలయాళీ సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న ఈ బ్యూటీకి గతంలో ఓ చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలోనే ఈ వీడియోపై రియాక్ట్ అయిన రాధిక.. మరోసారి ఈ ఇష్యూపై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సెక్స్ వర్కర్‌గా ఆమె నటించిన 'పార్చ్‌డ్' చిత్రం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ వివాదం సమయంలోనే ఆమెకు సంబంధించి ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో షాకైన రాధికా ఆప్టే.. తన ఫేస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని 2016లోనే క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి అదే అంశాన్ని లేవనెత్తి ఆమె వార్తల్లో నిలిచింది. ఆ న్యూడ్ వీడియో బయటికి వచ్చిన సమయంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారని, ట్రోల్‌ చేశారని చెబుతూ రాధిక ఆవేదన చెందింది. ఊహించని విధంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయానని, మానసిక వేదన అనుభవించానని ఆమె చెప్పింది. అయితే అందులో ఉన్నది తాను కాదనే విషయం తన డ్రైవర్‌, వాచ్‌మెన్‌, స్టైలిస్ట్‌‌లకు తెలుసు అని రాధిక పేర్కొంది. తెలుగులో బాలకృష్ణతో ''లయన్‌, లెజెండ్‌'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ''ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్'' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎప్పడూ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉంటూ ఎప్పుడూ జనం నోళ్ళలో నానడం అమ్మడి స్పెషల్ క్వాలిటీ. ప్రస్తుతం విదేశాల్లోని బీచుల్లో షికార్లు చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది రాధిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ugQieZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...