Thursday, 13 May 2021

కష్టకాలంలో రంగంలోకి దిగిన బాలయ్యా.. వారికి అండగా నిలుస్తూ భారీ సాయం అందజేత

సెకండ్ వేవ్‌లో కరోనా దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి దారుణంగా ఉంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ కరోనా తాకిడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ఆస్పత్రులు కిటకటలాడుతున్నాయి. దీంతో వైద్య సౌకర్యాలకు తీవ్రస్థాయిలో కోరత ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సరైన సమయానికి వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించేందుకు నటుడు, ఎమ్మెల్యే ముందుకు వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ కూడా బయటకు రాకుండా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. ప్రాణాలు కాపాడుకోవాలని అయన కోరారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. తాజాగా హిందూపురం కరోనా బాధితుల కోసం రూ.20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను హైదరాబాద్ ఆయన పంపించారు. బాలకృష్ణ పంపించిన కోవిడ్‌ కిట్లను తెలుగుదేశం పార్టీ నేతలు కోవిడ్ బాధితుల బంధువులకు అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు అంచనాలను తారాస్థాయికి పెంచేశాయి. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eIjSoX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...