Tuesday, 18 May 2021

టాలీవుడ్‌‌ని వెంటాడుతున్న కరోనా.. ప్రముఖ మేకప్ మెన్ మృతి

దేశంలో వీరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో వరుస విషాదాలకు కారణమవుతోంది. కరోనాతో కన్నుమూసిన సినీ ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనాతో కన్నుమూశారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మెన్‌గా పని చేసిన గంగాధర్ మృతిపై లక్కీ మీడియా నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''నా లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేశారు. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమా నుంచి నేను నిర్మించిన అన్ని చిత్రాలకే ఆయనే మేకప్ మెన్. ఆయనకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు కూడా వచ్చింది. నాకు ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు. తను లేడంటే నిజంగా నమ్మలేకపోతున్నా. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అన్నారు. తెలుగు, తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు కూడా మేకప్ మెన్‌గా పనిచేసిన గంగాధర్ హీరో శివాజీకి పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేశారు. శివాజీతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. గంగాధర్ మరణ వార్త తెలిసిన శివాజీ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హీరో శ్రీ విష్ణు, పాగల్ హీరో విష్వక్ సేన్‌తో పాటు ఆ మూవీ డైరెక్టర్ నరేష్, చిత్ర యూనిట్ మొత్తం మేకప్ మెన్ గంగాధర్ మరణంపై సంతాపం ప్రకటించింది. మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులు గంగాధర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tXFzFK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...