Tuesday, 18 May 2021

‘వకీల్‌సాబ్‌’ నుంచి ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్.. అదే జరిగితే ఇక పండగే!

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమా వచ్చిందంటే.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌.. దానిపై దృష్టి పెట్టాలని సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నారు. లేటెస్ట్‌గా ‘’ అనే సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించారు ఆయన. హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘పింక్’ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సినిమాలో పవన్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్యలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మధ్యే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లోనూ విడుదలై.. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదలై నెల రోజులు దాటినప్పటికీ.. చిత్ర యూనిట్ నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ వస్తూనే ఉంది. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ప్రత్యేకంగా గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘మగువా.. మగువా’ అనే పాట సూపర్‌హిట్ అయింది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ అందనుంది. ఈ సినిమా తాలూకా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్‌ను విడుదల చేయ్యనున్నట్టు థమన్ కన్ఫర్మ్ చేశారు. అయితే అది ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. థమన్ అందించిన ఈ గుడ్ న్యూస్‌తో పవన్‌ అభిమానులు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QrltGm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...