Wednesday, 26 May 2021

Akira Nandan: అకీరా సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ కామెంట్.. ఆ మాట చెబుతూ పవన్ మాజీ వైఫ్ రియాక్షన్

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సినీ వారసులు ఎంట్రీ ఇస్తుండటం కామన్. స్టార్ హీరోగా వెలుగొందిన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి రంగంలోకి దిగుతుంటారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తనయుడు టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్నాయి. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఈ ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా లైవ్ చాట్‌లో ఆమెకు మళ్ళీ అదే ప్రశ్న ఎదురుకావడంతో చిన్న క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎంతో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే తన పిల్లలు ఆద్య, అకీరా ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హంగామా చేస్తుంటారు. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితుల కోసం సోషల్ మీడియాను వాడేస్తూ అవసమున్న వారికి సాయం అందిస్తోంది రేణు. ఇలాంటి సమయంలో కొందరు నెటిజన్స్ అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి అడగడంతో రేణు దేశాయ్ ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తన పిల్లలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారని.. అందరూ అదే పని చేయండని ఆమె చెప్పారు. ఇది అకీరా సినిమా ఎంట్రీ గురించి చెప్పే సమయం కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని ఆమె చెప్పుకొచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి వరుసపెట్టి హీరోలు సినీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అకీరా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fNQblO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...