Wednesday, 26 May 2021

బయటకు కనిపించేవి నిజాలు కావు.. చాలా మందితో అంటూ అసలు గుట్టు విప్పిన సురేఖా వాణి కూతురు

నటి కూతురు సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ మధ్య సుప్రిత తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నందున బోర్ కొడుతోందని తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతున్నారు. అందులో భాగంగా మొన్నీ మధ్య సుప్రిత తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. నాన్నతో ఉన్న అనుబంధ క్షణాలను చెప్పండి అంటూ ఓ నెటిజన్ అడిగేశారు.ఇక పర్సనల్ విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. దానికి సుప్రిత ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. కొందరు హద్దులు మీరి ప్రశ్నలు సంధించారు. ఆర్ యూ వర్జిన్ అంటూ ఓ ఆకతాయి ప్రశ్నించేశారు. దీనిపై సుప్రిత ఫైర్ అవుతూ వకీల్ సాబ్ స్టైల్లో చిందులు తొక్కారు. అబ్జెక్షన్ అంటూ పవన్ కళ్యాణ్ కోర్టులో అసహనం వ్యక్తం చేసిన సీన్‌ను షేర్ చేశారు. ఇక మరో నెటిజన్ సుప్రిత మనస్తత్వం మీద కామెంట్ చేశారు. మీరు ఎప్పుడూ ఇలా పాజిటివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని ప్రశ్నించారు. దీనికి సుప్రిత స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు. బయటకు కనిపించేవి నిజాలు కావు.. నేను ఓవర్ థింక్, చాలా మందితో గొడవపడతాను..పర్సనల్ అని అవన్నీ చెప్పుకోలేం.. ఇక ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే అది లైఫ్ ఎలా అవుతుంది’ అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటేనే ఎప్పటికీ ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చారు. అలా సుప్రిత ఇప్పుడు తన చిట్ చాట్‌తో ఫుల్ ఫేమస్ అయింది. నెటిజన్లు వేసే ప్రశ్నలు, దానికి సుప్రిత ఇచ్చిన కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hVqDWj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...