Wednesday, 26 May 2021

ప్రేమను పంచుతానంటూ నిధి అగర్వాల్ న్యూ స్టెప్.. ప్రతి అభ్యర్థనపై పరిశీలనకు ఓ టీమ్

దేశంలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అంతటా కరోనా వీర విజృంభణ చేస్తోంది. దీంతో దేశ ప్రజలకు ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకకపోవడం లాంటి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి కరోనా కష్టకాలంలో తన వంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఇస్మార్ట్ బ్యూటీ . ఈ మేరకు ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె ప్రకటించింది. చిరంజీవి, సోనూసూద్ లాంటి సినీ నటులు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుండగా ఆ లిస్టులో నిధి అగర్వాల్ కూడా వచ్చి చేరింది. `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ఆమె ప్రారంభించనున్నారట. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని, సాయం అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్కు రిక్వెస్ట్లు పెట్టొచ్చని ఆమె పేర్కొంది. అలా వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి సాయం చేసేందుకు ఓ టీమ్ పని చేస్తుందని చెప్పింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాథమిక అవసరాలైన మందులు, ఆహారం లాంటివి అందిస్తామని తెలిపింది అందాల తార నిధి అగర్వాల్. బాలీవుడ్ మూవీ 'మున్నా మైకేల్' సినిమా ద్వారా కెమెరా ముందుకొచ్చిన నిధి.. ప్రెజెంట్ తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు'తో పాటు మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yEOUGh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...