Monday, 26 April 2021

సెట్‌లో అందరూ నన్ను ట్రై చేసేవారు.. పవన్ కళ్యాణ్ సైతం అలా.. నటి జ్యోతి కామెంట్స్

తెరపై బోల్డ్ పాత్రలు వేసి అందరినీ మెప్పించిన నటి జ్యోతి. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కనిపించి మరింత దగ్గరయ్యారు. అయితే తన కెరీర్‌లో వేసిన పాత్రలన్నీ కాస్త మసాలా దట్టించినవే. వ్యాంప్ పాత్రలతోనే జ్యోతికి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం జ్యోతికి వెండితెర మీద అంతగా ఆఫర్లు రావడం లేదు. ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న జ్యోతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. జ్యోతి వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. భర్తకు దూరంగా ఉంటూ కొడుకును పెంచుకుంటూ ఉన్నారు జ్యోతి. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని అతని దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన డబ్బులతో బతుకుతున్నానని, పిల్లాడిని పోషించుకుంటున్నానని జ్యోతి చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరో సీక్రెట్ బయటపెట్టేశారు జ్యోతి. సెట్‌లో ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని అందరూ చెబుతుంటారు. కానీ మొదటి సారిగా దానికి విరుద్దంగా జ్యోతి కామెంట్ చేశారు. సెట్స్‌లో అందరూ తననే ట్రై చేసేవారని, ఏదో విధంగా రకరకాలుగా ప్రయత్నాలతో ఇంప్రెస్ చేద్దామని ట్రై చేసేవారంటూ జ్యోతి చెప్పుకొచ్చారు. అలా తన మీద పవన్ కళ్యాణ్ కవిత్వం కూడా రాసేశారని జ్యోతి సెన్సేషనల్ కామెంట్ చేశారు. దీంతో జ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది గుడుంబా శంకర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలోనే జ్యోతి, పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా జ్యోతి చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక జ్యోతి ఇప్పుడు డేటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి సంగతి ఏమోగానీ డేటింగ్‌కు మాత్రం రెడీ అన్నట్టు కనిపిస్తోంది. సరైన వాడు దొరికితే డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చారు జ్యోతి. ప్రస్తుతం జ్యోతి బుల్లితెరపై కొన్ని షోల్లో అలా అలా మెరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32QjVrX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...