Monday, 26 April 2021

విజయ్ రేంజ్ సక్సెస్ కోసం.. మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఆనంద్..

‘దొరసాని’ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు . సోదరుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా అతను .. తొలి సినిమాలోనే తనదైన మార్క్ నటనని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత ‘మిడిల్‌క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఈ జూనియర్ రౌడీ. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట ఆనంద్. ఇప్పటివరకూ ఆనంద్ చేసిన రెండు సినిమాల్లో క్లాస్ పాత్రల్లోనే కనిపించాడు. కానీ, విజయ్ మాత్రం హీరోగా చేసిన రెండో సినిమాతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పూర్తిగా రియలిస్టిక్‌గా రూపొందిన ఈ సినిమాకి యూత్ వివరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాని హిందీ, తమిళంలో రీమేక్ చేసినప్పటికీ.. విజయ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని ఆ భాషల్లో ఆ హీరోలు క్రియేట్ చేయలేకపోయారు. ఇక ఆ సినిమా తర్వాత స్టార్ హీరో రేంజ్‌ని సంపాదించుకున్నాడు విజయ్. ఇప్పుడు ఆనంద్ కూడా అదే ప్లాన్‌లో ఉన్నాడట. రొటీన్ కథతో కాకుండా.. ఓ విభిన్నమైన జోనర్‌లో అతను సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆనంద్ ‘పుష్పకవిమానం’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో శాన్వీ మేఘన హీరోయిన్‌గా చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దామోదర దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ వైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే రఘు అనే దర్శకుడు చెప్పిన కథని విన్నాడట ఆనంద్. అతను చెప్పిన కథ.. ముఖ్యంగా అందులోకి పాత్ర తనకి నచ్చడంతో.. సినిమాకు వెంటనే ఓకే చెప్పాడట. ఈ సినిమాతో ఆనంద్‌ కూడా విజయ్ లా స్టార్ స్టేటస్‌ని సాధించడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nkCgXA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...