Wednesday, 21 April 2021

వాట్సప్ డీపీ, వాల్ పేపర్ అన్నీ లీక్.. ఇమాన్యుయేల్ వ్యవహారం మామూలుగా లేదు!

బుల్లితెరపై షో సృష్టించిన, సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బూతు షో అంటూ అందరూ ఏకిపారేస్తూనే కళ్లప్పగించి మరీ చూస్తుంటారు. అందులో వాడే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు సోషల్ మీడియాలో ఒక్కోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. ఇక అందులోని జంటలు మాత్రం నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటారు. సుధీర్ రష్మీ గత ఎనిమిదేళ్లుగా కెమిస్ట్రీతో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మ్యాజిక్‌ను ఇమాన్యుయేల్ కూడా క్రియేట్ చేశారు. అతి తక్కువ కాలంలోనే వర్ష జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యారు. అయితే ఇమాన్యుయేల్ జబర్దస్త్ షోలో గత రెండేళ్ల నుంచి ఉన్నా కూడా వర్ష రాకతో మరింతగా వెలుగులోకి వచ్చారు. వర్ష ఎంట్రీ కంటే ముందు ఇమాన్యుయేల్‌ను బాగానే ఫేమస్ చేసింది. అతని నలుపు వర్ణాన్ని గుర్తుకు తెస్తూ చాక్లెట్ బాయ్ అంటూ రోజా పెట్టిన పేరుతో ఇమాన్యుయేల్ బాగానే ఫేమస్ అయ్యారు. అలా ప్రతీసారి తన స్కిట్లలో ఒక్కసారైనా రోజాతో పంచ్‌లు వేయించుకోవడం లేదా చాక్లెట్ బాయ్ అని అడిగి మరీ పిలిపించుకునే వాడు. మొదటి నుంచీ కూడా ఇమాన్యుయేల్‌ను రోజా ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. అలా స్కిట్లో ఎక్కడో మూలన ఉండే ఇమాన్యుయేల్‌ను అందరి ముందుకు వచ్చేలా రోజా చేశారు. ఇక ఇమాన్యుయేల్ వర్ష వ్యవహారంపైనా రోజా కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ప్రేమ వ్యవహారం హైలెట్ అయ్యేలా ఈ ఇద్దరినీ నిలబెట్టి మరీ ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే రోజా గురించి ఇమాన్యుయేల్ ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో తన భక్తి భావాన్ని బయటపెట్టేశారు. తాజాగా మరోసారి ఇమాన్యుయేల్ తన భక్తిని చాటుకున్నారు. తాజాగా ఇమాన్యుయేల్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. అందులో కొందరు ఇమాన్యయేల్ మీద, రంగు గురించి కాస్త నెగెటివ్ కామెంట్లు చేసినా చాలా మంది మాత్రం అతని టాలెంట్‌ను ప్రశంసించారు. అయితే కొంత మంది మాత్రం వాట్సప్ డీపీ, వాల్ పేపర్ అంటూ సీక్రెట్ విషయాలు అడిగేశారు. అయినా కూడా వాటిని కూడా చూపించేశాడు. అక్కడే అసలు విషయం బయటకు వచ్చింది. వాట్సప్ డీపీ, వాల్ పేపర్ ఇలా అన్నింటా రోజా ఫోటోలను పెట్టేసుకున్నాడు ఇమాన్యయేల్. అంతే కాకుండా రోజా గురించి చెబుతూ.. మై నేమ్ ఈజ్ ఇమాన్యుయేల్ మై గాడ్ ఈజ్ అది మీకు తెలుసు (వకీల్ సాబ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పినట్టుగా) అంటూ బండ్ల గణేష్ ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా మరో నెటిజన్ రోజా గురించి చెప్పమని అడిగితే.. మేడమ్ సర్ మేడమ్ అంతే అంటూ ఈ సారి అల్లు అర్జున్‌ను వాడేశారు. మొత్తానికి ఇమాన్యుయేల్ మాత్రం రోజా దగ్గర వందకు రెండొందల మార్కులు కొట్టేసేట్టు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇమాన్యుయేల్ చెప్పిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3asKvMh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...