Wednesday, 21 April 2021

టిక్ టాక్ భార్గవ్ కేసులో ట్విస్టులు.. లిస్టులో చాలామంది గర్ల్స్!! లైవ్‌లో మరో యువతి ఆవేదన

ఫన్ బకెట్ భార్గవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14 ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేసిన ఈ కామాంధుడి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ నెల 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. అమ్మాయి బట్టలు మార్చుకునే టైంలో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెపై బెదిరింపులకు పాల్పడటం, అలాగే పలుమార్లు లైంగికంగా అనుభవించడం చేశాడని పోలీసులు తెలపడంతో ఈ ఇష్యూపై పెద్దఎత్తున చర్చలు నడుస్తున్నాయి. భార్గవ్ గతంలో కూడా చాలా మంది యువతులను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే ఏ ఒక్క అమ్మాయి నేరుగా అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో పలు యూట్యూబ్ ఛానల్స్ గతంలో అతనితో వీడియోలు చేసిన కొందరు అమ్మాయిల పేర్లు బయటకు తీస్తున్నాయి. ఇప్పటికే OMG నిత్య పేరు తెరపైకి రాగా తనకు, ఈ కేసుకు సంబంధం లేదని, భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయిందని క్లారిటీ ఇచ్చింది నిత్య. ఈక్రమంలోనే గతంలో భార్గవ్‌తో వీడియోలు చేసిన యువతులు ఒక్కొక్కరుగా లైవ్ లోకి వచ్చి తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తమ పేర్లు వాడకూడదని చెబుతున్నారు. తాజాగా భార్గవ్‌తో గతంలో అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు చేసిన అనే అమ్మాయి ఓ వీడియో ద్వారా రియాక్ట్ అవుతూ తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పింది. ''అమ్మాయి - అబ్బాయి ఆపేసి రెండున్నర సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి భార్గవ్‌తో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. కానీ అప్పటి వీడియోల్లోంచి ఫొటోలు వాడుతూ ఇప్పుడు జరుగుతున్న కేసులో వాడుతున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా అవన్నీ డిలీట్ చేసి ఇకపై అలాంటివి చేయొద్దని కోరుకుంటున్నా. నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. ప్రస్తుతం పలు షూట్స్‌తో బిజీగా ఉన్నాను'' అని తెలిపింది మౌనిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xcsUSe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...