Wednesday, 21 April 2021

మహేష్ కోసమే వెళ్ళాం కానీ మేమిద్దరం ఎంజాయ్ చేశాం.. అతనితో వేసిన ఆ ట్రిప్ ఎన్నటికీ మరువలేను! నమ్రత ఓపెన్

సూపర్ స్టార్ తన ఫ్యామిలీ పట్ల ఎంత కేర్ తీసుకుంటారనేది మనందరికీ తెలుసు. సినిమాలు, వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే వీలుచిక్కినప్పుడల్లా భార్య , కొడుకు గౌతమ్, కూతురు సితారలను వెంటపెట్టుకొని టూర్స్ వేస్తుంటారు. ఇక ఆయా ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ వద్దకు తీసుకువస్తూ ఆయన అభిమానులను స్పెషల్ ట్రీట్ ఇస్తుంటుంది మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన ఓ ఫొటో, దానిపై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబు సినిమా షూటింగ్స్ కోసం అతనితో అప్పుడప్పుడూ వెళ్లి దేశ విదేశాలు చుట్టి రావడం నమ్రత హ్యబీ. ఇలానే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లిన ఆమె.. మహేష్ బాబును వదిలేసి కొడుకుతో అక్కడి పర్వతాలను చుట్టేసిందట. ఇద్దరూ కలిసి అందమైన లొకేషన్స్‌లో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేశారట. ఆ రోడ్ ట్రిప్ ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొంటూ తాజాగా తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ పెట్టింది నమ్రత. ఈ మేరకు తన కొడుకుతో దిగిన పిక్‌ షేర్ చేసింది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత కెమెరా ముందు కనిపించని నమ్రత.. మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. వ్యాపార రంగంలో ఆయనకు అండదండగా ఉంటూ ఎప్పటికప్పుడు ఇలా సోషల్ మీడియా ద్వారా మహేష్ విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు తన 27వ సినిమా 'సర్కారు వారి పాట' చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3asLLyI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...