Wednesday, 21 April 2021

అందాల రంభ అంటే పడిచచ్చే జగపతి బాబు.. ఆమె పర్మిషన్‌తోనే అంతా! అసలు విషయం బయటకొచ్చిందిలా..

సినీ తారలు కూడా సాధారణ మనుషులే. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్స్ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన రంభకు జగ్గూ భాయ్ వీరాభిమాని అని తెలుస్తోంది. ఆమె అంటే పడి చచ్చేంత అభిమానం ఆయనకుందట. అయితే ఇదంతా రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ''లో. ఈ సినిమాను రూపొందిస్తున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఇలా జగ్గూ భాయ్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూపించబోతున్నారని తెలిసింది. అప్పట్లో రంభతో కలిసి పలు సినిమాల్లో తెరపంచుకున్న జగపతిబాబును ఆమె ఫ్యాన్‌గా ఈ సినిమాలో ప్రెజెంట్ చేయబోతున్నారట. ఈ రీల్‌ జోడీతో ఇన్నేళ్లకు మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయనున్నారట 'మహా సముద్రం' మేకర్స్. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరగగా ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జగపతిబాబుపై ఓ స్పెషల్ సాంగ్‌ చిత్రీకరించారు. ఈ పాటలో ఫొటోలు, ఫ్లెక్సీల నడుమ ఆమె అభిమానిగా జగ్గూ భాయ్ నటించారట. ఈ సాంగ్ షూట్ చేయడానికి ముందు రంభ పర్మిషన్‌ కూడా తీసుకుందట చిత్రయూనిట్. మొత్తానికైతే ఈ వార్త మాత్రం సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'మహా సముద్రం' సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ అంచనాలు పెంచేశాయి. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశంతో ఈ మూవీ రుపొందుతోందని యూనిట్ అంటోంది. ఆగస్టు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tFgFvl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...