తెలుగు తెరపై ఒక్కసారిగా మెరిసిన భామలు ఆ తరువాతి కాలంలో కాస్త వెనకబడతుంటారు. కెరీర్ ప్రారంభంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంటారు. కాస్త తేడా కొడితే సినిమాలు ఫ్లాప్ అయితే కథ మొత్తం మారుతుంది. అలా కెరీర్ ఒకప్పుడు పీక్స్‌లో ఉండేది. కానీ ఇప్పుడు సరైన ఆఫర్లు కూడా రావడం లేదు. సరైన హిట్ పడకపోయినా కూడా అడపాదడపా అవకాశాలు మాత్రం అను ఇమాన్యుయేల్‌కు వస్తున్నాయి. ప్రస్తుతం అను ఇమాన్యుయేల్ రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. చివరగా అల్లుడు అదుర్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మరీ నాసిరకం పాత్రలో కనిపించడంతో అను ఇమాన్యుయేల్ కెరీర్‌కు ఆ చిత్రం అంతగా ఉపయోగపడలేదు. అయితే ఇప్పుడు మాత్రం అను ఇమాన్యుయేల్‌కు మంచి పాత్రలు వచ్చినట్టు కనిపిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్దార్థ్, శర్వానంద్ హీరోలు వస్తోన్న మూవీలో అను ఇమాన్యుయేల్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాకుండా అల్లు శిరీష్ హీరోగా రాబోతోన్న ఓ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ మధ్య అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్ మహా సముద్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా బీచ్ ఒడ్డున అలా సేద తీరుస్తూ ఎంజాయ్ చేస్తోన్నట్టు ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఎవరినో వెక్కిరిస్తోన్నట్టు కొంటెగా పోజులు పెట్టేశారు. అయితే ఆమెకు ఎదురుగా ఉన్నది ఎవరు? ఆ వీడియోను తీసింది ఎవరు? అన్నది మాత్రం రివీల్ చేయలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qe1PxE
v
No comments:
Post a Comment