Wednesday, 21 April 2021

ఆ ఛాన్స్ వస్తే ఎవరు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు?.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్

ఒకప్పటి బొద్దు గుమ్మ ఇప్పటి ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో కాస్త లావుగా, చబ్బీగా ఉన్న రాశీ ఖన్నా ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. దాదాపు ఏడాదికి పైగా వర్కవుట్లు చేసి జీరో సైజ్‌లోకి మారిపోయారు. ఏకంగా బికినీ ధరించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఒకప్పుడు లావుగా ఉన్న రాశీ ఖన్నా ఇలా బికినీ ధరించే ఆకృతిలోకి మారడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే దాని వెనుక ఏడాదికిపైగా శ్రమ పడ్డానని చెప్పుకొచ్చారు. సరైన న్యూట్రిషన్, వర్కవుట్లతోనే అదంతా సాధ్యమైందని రాశీ ఖన్నా తెలిపారు. ఇప్పుడు రాశీ ఖన్నా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అక్కడికి ఇక్కడికి అని తిరుగుతూ తెగ సందడి చేస్తున్నారు. ఒక రోజు గోవాలో ఉంటే ఇంకోరోజు చెన్నైలోఉంటున్నారు. మళ్లీ మరుసటి రోజు కొచ్చిలో ప్రత్యక్షం అవుతున్నారు. మళ్లీ సడెన్‌గా హైద్రాబాద్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలా రాశీ ఖన్నా క్షణం తీరిక లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశారు. షూటింగ్‌లంటూ అక్కడికి ఇక్కడికి తిరిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ షూటింగ్‌లు మూలకు పడ్డాయి. కొన్నిచోట్ల లాక్డౌన్‌ కూడా పెట్టేశారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు ఎవ్వరూ చేయరు. ఆ సాహసం ఎవ్వరూ కూడా చేయలేరు. అయితే ఎక్కడికైనా వెళ్లే చాన్స్ ఇస్తే.. ఎవరు వెళ్తారు.. ఎక్కడికి వెళ్తారు అంటూ రాశీ ఖన్నా తన ఫాలోవర్లను అడిగేశారు. ఈ మేరకు రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. రాశీ ఖన్నా చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కనిపించగా.. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి గోపీచంద్ కాంబోలో రాబోతోన్న పక్కా కమర్షియల్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3apBUtp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...