Sunday, 4 April 2021

శ్రీముఖి ముందే ఆమెను అక్కడ టచ్ చేసిన సద్దాం.. అమ్మాయిలంతా చూస్తుండగానే కానిచ్చేశాడు బాబోయ్! అరాచకం

నిజామాబాద్ పిల్ల హవా హైదరాబాద్‌లో ఫుల్లుగా నడుస్తోంది. వెండితెర, బుల్లితెర మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ ఆమె హంగామానే కనిపిస్తోంది. టీవీ యాంకర్‌గా సత్తా చాటుతూ గ్లామర్ డోస్‌ వడ్డించి పాపులారిటీ పెంచుకుంటోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న షో అంటే హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు ధీమాగా ఉండే స్టేజ్‌కి వెళ్లింది బుల్లితెర రాములమ్మ. అయితే తాజాగా జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అందరి ముందే కమెడియన్ చేసిన పని చూసి నోరెళ్లబెట్టింది శ్రీముఖి. కెమెరా ముందు అల్లరి చేష్టలు చేస్తూ ఆకట్టుకునే శ్రీముఖి షాకయ్యేలా చేశాడు సద్దాం. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట' అనే స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. దీనికి యాంకర్‌గా శ్రీముఖి చేస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం తాలూకు ప్రోమో వీడియోస్ రిలీజ్ చేయగా అందులో కమెడియన్ సద్దాం అమ్మాయిలతో యమ రెచ్చిపోతూ కనిపించాడు. ఓ అమ్మాయితో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ 'కన్నెపిట్టారో కన్నుకొట్టారో' పాటకు చిందులేసిన సద్దాం.. ఆ తర్వాత అదే నాగార్జున స్టైల్‌లో మరో అమ్మాయి బ్యాక్‌పై అందరూ చూస్తుండగానే గట్టిగా ఒక్కటిచ్చాడు. ఆ సీన్ చూసి అక్కడున్న అమ్మాయిలంతా నోరెళ్ళబెట్టారు. శ్రీముఖి అయితే ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆ తర్వాత శ్రీముఖి వచ్చి సద్దాంతో ఏదో సర్ది చెప్పబోతుంటే.. నీకూ ఇవ్వమంటావా? అని సద్దాం అనడంతో దెబ్బకు సైలెంట్ అయింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సద్దాం కామెడీ టైమింగ్ అదుర్స్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం.. ఎంతో సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mgrO31
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...