Sunday, 4 April 2021

హాలీవుడ్ రీమేక్‌లో యంగ్ రెబల్ స్టార్.. బాలీవుడ్ స్టార్ హీరోని పక్కనపెట్టి మరీ ప్రభాస్‌కి ఛాన్స్!

యంగ్ రెబల్ స్టార్ గురించి సినీ ప్రేక్షకులకు చెప్పాలంటే.. బాహుబలికి ముందు.. ఆ తర్వాత అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ కెరీర్‌పై అంతలా ముద్ర వేసింది జక్కన రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రం. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ప్రతీ సినిమా అదే రేంజ్‌లో ఉండాలని ఊహించుకుంటున్నారు అభిమానులు. కానీ, బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశ పరిచింది. భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించినంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తన కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇక ఆదిపురుష్, సలార్ నుంచి ఎప్పుడు అప్‌డేట్స్ వస్తాయా.. అని ప్రభాస్ అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీ టౌన్‌లో వినిపిస్తున్న ఓ ఆసక్తికర వార్త ప్రభాస్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. హాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘రాంబో’ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్త్ ఆనంద్ హిందీలో రీమేక్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో తొలుత హీరోగా టైగర్ ష్రాఫ్‌ని అనుకున్నారట. రాంబో పాత్రలో నటించేందుకు కావాల్సిన ఫిజిక్ టైగర్‌లో ఉండటంతో అతనే ఈ పాత్రకి పర్‌ఫెక్ట్ అని దర్శకుడు భావించాడని తెలుస్తోంది. ‘వార్’ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారట. కానీ, టైగర్ అప్పటికే ‘గణ్‌పత్’ పార్ట్ 1, 2.. హీరోపంతి 2, భాగీ 4 సినిమాలకు సైన్ చేసేశాడు. దీంతో డేట్లు అడ్జెస్టు కాక అతను ఈ సినిమాకు సైన్ చేసేందుకు ముందుకు రాలేదట. దీంతో టైగర్‌ కంటే పెద్ద స్టార్‌డమ్ ఉన్న ప్రభాస్‌ని ఈ సినిమాలో హీరోగా తీసుకొనే ప్రయత్నాలను దర్శకుడు సిద్ధార్త్ ప్రారంభించాడట. ఇప్పటికే ప్రభాస్‌కి సిద్ధార్త్ స్క్రిప్ట్ కూడా వినిపించాడని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభాస్ దీనిపై ఎటువంటి రియాక్షన్ ఇచ్చారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టే ఓకే అయితే.. యంగ్ రెబల్ స్టార్‌కి హాలీవుడ్ రేంజ్‌లో స్టార్‌డమ్ వస్తుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31LAwwI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...